సత్యసాయి: కదిరిలో గతంలో డీఎస్పీగా విధులు నిర్వహించిన ఎస్. భవ్య కిషోర్‌కు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి లభించింది. గ్రూప్-1, 2018 బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రతిభకు గుర్తింపుగా ఈ పదోన్నతి దక్కింది. ప్రస్తుతం ప్రసూతి సెలవులో ఉన్న భవ్య కిషోర్, సెలవులు ముగిసిన తర్వాత మంగళగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.