ఇండియాలోనే అద్భుతమైన సినిమాటోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రత్నవేలు మెగాఫోన్ పట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించేందుకు ఓ కథను సిద్ధం చేస్తున్నాడట. తన తొలి మూవీ కోసం ఎమోషనల్ డెప్త్ ఉన్న పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ కథను ఎంచుకున్నట్లు టాక్. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాత, ఆ పాత్రకు సరిపోయే స్టార్ హీరోకి కథ వినిపించాలనే ఆలోచనలో ఉన్నాడట.