ASR: మాజీ సీఎం, ప్రముఖ సినీనటుడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను గురువారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ శ్రీపూజ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా సేవ, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎన్టీఆర్ చేసిన కృషిని కొనియాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో ఆయన పాత్ర విశేషమని కొనియాడారు.