AP: గోదావరి నీళ్లు సముద్రంలో కాకుండా రైతు జీవితాల్లో కలవాలనే లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. 2014-19లోనే పోలవరం పనులు 70% పూర్తి చేశామని.. కానీ గత YCP ప్రభుత్వ హయాంలో కేవలం 5% పనులే జరిగాయన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి 30 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తామని పెమ్మసాని ప్రకటించారు.