ATP: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు టీడీపీకి భారీ విరాళం ప్రకటించారు. SRC సంస్థ నుంచి రూ.1.50 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. పార్టీ బలోపేతం కోసం విరాళం అందించిన ఎమ్మెల్యేను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు అభినందనలు తెలియజేశారు.