NTR: నందిగామ నియోజకవర్గంలో గురువారం ఎండలు తీవ్రంగా తారసపడ్డాయి. బుధవారం చల్లని వాతావరణం ఉండగా, గురువారం నాలుగు మండలాల్లో గరిష్టంగా 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఒక్కసారిగా పెరిగిన వేడిమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లపై రాకపోకలు తగ్గిపోవడంతో గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి.