MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలో గోదావరి ఇసుక దందా జోరుగా సాగుతుంది. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ఇసుక కొనాలంటే ఒక ట్రాక్టర్ ఇసుక ధర రూ. 8 వేలు పలుకుతుంది.. ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా ధరలు పెంచడంతో సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంతా జరుగుతున్న అధికారులు మాత్రం చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.