PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో ఈనెల 31 నుంచి జూన్ 3 వరకు చిరుతల రామాయణం నాటక ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రామాయణం పాత్రధారులు గురువారం గ్రామ దేవత పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. మహిళలు బోనాలు ఎత్తుకొని, పాత్రధారులు చిరుతలతో పాటలు పాడుతూ ఆలయం వద్దకు చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. నాటక ప్రదర్శన సక్రమంగా కొనసాగాలని వేడుకున్నారు.