ASF: ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ఈ మేరకు మంత్రి గడ్డం వివేక్‌కు లేఖ రాశారు. వెనుకబడిన, గిరిజన ప్రాంత యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. దీనివల్ల పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న సిబ్బంది కూడా అందుబాటులోకి వస్తారని మంత్రి తెలిపారు.