KDP: భద్రంపల్లి గ్రామంలో సుమారు 500 సంవత్సరాల నాటి భారీ ప్రాచీన వృక్షం ఒక్కసారిగా నేలకూలింది. ఈ ఘటనలో చెట్టు కింద నిలిపి ఉంచిన ట్రాక్టర్ పూర్తిగా ధ్వంసమైంది. వృక్షం రహదారిపై పడటంతో గ్రామంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్థులు తెలిపారు.