కోనసీమ: వేసవి తీవ్రతతో విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 24 గంటల కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. రాజేశ్వరి తెలిపారు. వినియోగదారులు సమస్యల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912 తో పాటు జిల్లా, డివిజన్ కంట్రోల్ రూములను సంప్రదించాలని సూచించారు.