నల్గొండ మండలం పానగల్ బైపాస్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్ను బలంగా డీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్సు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.