JN: తరిగొప్పుల మండల కేంద్రంలోని PACS గోదామును అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఐకేపీ కేంద్రాల నుంచి వచ్చే ధాన్యం సేకరణ, నిల్వ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మండలంలో ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.