KMM: జిల్లాలో గురువారం ఎండలు దంచి కొట్టాయి. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం, ఏన్కూరు మండలం తిమ్మరావుపేటలో 46.2°C అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో అత్యల్పంగా 43°C ఉష్ణోగ్రత నమోదయింది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.