ENR: రామన్నగూడెం గ్రామానికి చెందిన కందుకూరి సారమ్మ ఇటీవల వడదెబ్బతో మృతి చెందగా, మాజీ జడ్పీ ఛైర్మన్, BRS ములుగు నియోజకవర్గ ఇంఛార్జ్ బడే నాగజ్యోతి గురువారం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. సారమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన ఆమె.. కుటుంబానికి BRS పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.