AP: రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం సహకారానికి మహానాడు కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మహానాడులో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు తీసుకువచ్చిన నిధులు, హామీలు, ఇతర అంశాల గురించి ఈ తీర్మానంలో ప్రస్తావించారు. AP అభ్యున్నతికి భవిష్యత్తులో కూడా కేంద్రం తోడుగా నిలుస్తుందని TDP నేతలు ఆకాంక్షించారు.