CTR: సదుం మండలంలోని జాండ్రపేట రామలింగ చౌడేశ్వరీ దేవి ఆలయ పుష్కర కుంభాభిషేక ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం అవుతాయని నిర్వాహకులు తెలిపారు. 29న కలశ స్థాపన, గణపతిపూజ, 30న హోమాలు, శుద్ధాభిషేకం, పూర్ణాహుతి, 31న అభిషేకాలు, పుష్కర మహాకుంభాభిషేకం, జ్యోతి దర్శనం, పుష్పపల్లకి ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.