ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిత్య అన్నదాన పథకానికి విజయవాడకు చెందిన శ్రీ కే. జయశంకర్ – శిరీష దంపతులు రూ.1,81,116 విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని దేవస్థానం అధికారులు స్వీకరించి వారిని అభినందించారు. భక్తుల సహకారంతో నిత్య అన్నదాన కార్యక్రమం మరింత సజావుగా, నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు.