‘పెద్ది’లో తన పాత్ర ‘అప్పలసూరి’పై జగపతి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ రోల్, దీని యాసలో ఒక మ్యాజిక్ ఉంది. ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడం పెద్ద సవాలుగా అనిపించింది. కొన్నిసార్లు రోజంతా కేవలం 2 డైలాగులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మేకప్నకే 3 గంటల సమయం పట్టేది. ఇప్పటి వరకూ నా కెరీర్లో చేసిన సినిమాలన్నీ ఒకెత్తు.. పెద్ది మరో ఎత్తు’ అని అన్నాడు.