BDK: ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతి, పూర్వీకుల ఆచారాలను కాపాడుకోవడం ఎంతో గొప్ప విషయమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామంలో జరిగిన బాపనమ్మ చంద్రపాల (బాలరాజు) ఆదివాసీల ఇలవేల్పు పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువత, మహిళలు సంప్రదాయ నృత్యాలు, పూజలు జరిపారు.