VSP: ఆర్కేబీచ్ వద్ద ఉన్న మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి భీమిలి ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగానే టీడీపీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.