WGL: మే నెలలో కేంద్ర ప్రభుత్వం నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపు ఇంకా కొనసాగే అవకాశముందని నిపుణులు హెచ్చరించడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. వ్యవసాయ పనులు, రవాణాకు ఇంధనంపై ఆధారపడే రైతులు, సాధారణ ప్రజలు ధరల భారం మోయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. PM స్పందించి ధరలు తగ్గించాలని కోరారు.