TG: మొక్కజొన్న, వరి పంటలు వర్షంకు తడిసి పోయి మురుగు వాసన వస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రైతు గోస BJP భరోసా యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలో BJLP నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. లారీలు, హమాలీల కొరతతో ధాన్యం లోడింగ్ నుంచి రైస్ మిల్లులకు తరలించే దాకా రైతు ఎంతో నష్ట పోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.