ATP: ఉరవకొండ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో అసంపూర్తిగా నిర్మాణాలు చేపట్టి నిలిచిపోయిన అంగన్వాడీ కేంద్రాలకు నిధులు మంజూరైనట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో నిలిచిపోయిన 57 అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం రూ. 5.39 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో నెంబర్ 87ను విడుదల చేసిందన్నారు. త్వరలో పనులు ప్రారంభం అవుతాయన్నారు.