JGL: ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఆశ వర్కర్లు గురువారం మంత్రి లక్ష్మణ్ కుమార్ను కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఆశ వర్కర్ల న్యాయమైన సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు.