NZB: ముప్కాల్ మండల కేంద్రంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను, గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం వృద్ధులకు, పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు డా.రాములు, దయానంద్, లోక రాములు, చిన్నయ్య, జనార్ధన్, లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.