BDK: బూర్గంపాడు మండలం, సారపాక గ్రామపంచాయతీలో రోడ్ల పరిశుభ్రత కోసం కొనుగోలు చేసిన జటాయు వాహనం నిరుపయోగంగా నిలిచిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.25 లక్షలు ఖర్చు చేసిన ఈ వాహనం ఇప్పటివరకు వినియోగంలోకి రాకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొత్త పాలకవర్గం స్పందించి వాహనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.