SRCL: తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మదీనా మసీదులో బక్రీద్ సందర్భంగా ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మదీనా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ హైదర్ మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళి కోసం ప్రార్థనలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మౌలానా అక్బర్, మహమ్మద్ హమీద్, గౌసుద్దీన్, జాని, ఖలీల్ పాల్గొన్నారు.