కడప: బద్వేలు మున్సిపాలిటీ 5వ వార్డు నాగులచెరువు కట్ట రోడ్డుపై చెత్త సమస్య తీవ్రంగా మారింది. చెత్త కుండీలు నిండిపోవడంతో వ్యర్థాలు రోడ్డుపైనే పేరుకుపోయాయి. రోడ్డుపై పడేసిన చెత్తలో పందులు సంచరిస్తుండటంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దుర్వాసనతో పాటు అంటువ్యాధుల భయం నెలకొన్నదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.