MDK: బక్రీద్ సందర్భంగా మెదక్ టౌన్‌లోని నవాబ్‌పేట్, గాంధీనగర్ ఈద్గాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన శాంతిభద్రతలను సమీక్షించారు. ప్రజలందరూ ప్రశాంతమైన, సామరస్యపూర్వక వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ఎస్పీ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.