ELR: దివంగత ఎన్టీ రామారావు 103వ జయంతి వేడుకలు ఏలూరులో గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని ఆయన బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు.