GDWL: అయిజ పట్టణంలోని ఓ చాట్ బండార్లో పానీపూరి తిని అస్వస్థతకు గురైన వారి సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటికే 15 మంది తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరగా, అదే రోజు గట్టు మండలం గొర్లఖాన్ దొడ్డికి చెందిన మరో నలుగురు కూడా అదే షాపులో పానీపూరి తిని తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. తాజాగా వీరిని మెరుగైన చికిత్స కోసం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలివెళ్లారు.