MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలోని 6వ వార్డుకు చెందిన బానారి రాజేశ్వరి ఇంట్లో వెలిసిన పవిత్ర పుట్ట చుట్టూ రక్షణ నిర్మాణం చేపట్టేందుకు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. గురువారం ఆయన ఆదేశాల మేరకు పార్టీ నాయకులు రాజేశ్వరి నివాసానికి వెళ్లి నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు.