ATP: రాయదుర్గం నియోజకవర్గంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ ట్రోఫీ కేసీఎల్-3 క్రికెట్ టోర్నమెంట్ను కాలవ ఫౌండేషన్ ఛైర్మన్ కాలవ భరత్ గురువారం ఘనంగా ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. యువత క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు.