BDK: మణుగూరు PHCలో గురువారం జాతీయ ఋతుక్రమ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా వైద్యులు అవగాహన సదస్సు నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ సునీల్ మాట్లాడుతూ.. మహిళలు, కిశోర బాలికలు నెలసరి పరిశుభ్రతపై సరైన అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని తెలిపారు. నెలసరిపై అపోహలు, మచ్చ, అపహాస్యాన్ని తొలగించి, ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించాలని అన్నారు.