టాలీవుడ్లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య పర్సంటేజ్ వివాదంపై యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల పెద్ద నిర్మాతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాల సమస్యలు వేరు, చిన్న మూవీల సమస్యలు వేరు. పవన్‌ని కలిసేటప్పుడు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, మమ్మల్ని పిలవలేదు’ అని తెలిపాడు.