BDK: అశ్వాపురం మండలం, గొండిగూడెం గ్రామంలో జరిగిన ఆదివాసుల ఇలవేల్పుల పండుగలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవడం గొప్ప విషయమని అన్నారు. గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.