AP: ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చి APకి చంద్రబాబు ‘బ్రాండ్ అంబాసిడర్’గా మారారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 24 నెలల్లో రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, ఈ రెండేళ్లలో 24 లక్షల మందికి ఉపాధి వచ్చేలా CM చంద్రబాబు చేసిన కృషి ప్రశంసనీయమని మహానాడులో చెప్పారు. అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోందని, పోలవరాన్ని గాడిలో పెట్టామని తెలిపారు.