SRH ఆటగాడు ఇషాన్ కిషన్ గొప్ప మనసు చాటుకున్నాడు. IPLలో హైదరాబాద్ బౌలర్ సాకిబ్ హుస్సేన్‌కు ఆరు జతల షూలను బహుమతిగా ఇచ్చాడు. ఒక్కో షూ జత విలువ రూ.20 వేల వరకు ఉంటుంది. గతంలో సాకిబ్ తల్లి తన బంగారం తాకట్టు పెట్టి మరీ అతనికి షూలు కొనిచ్చిందట. ఈ విషయం తెలిసి ఇషాన్ సాయం చేశాడని సాకిబ్ స్వయంగా వెల్లడించాడు.