SRD: కోహిర్ మండలం దిగ్వాల్ లో గ్రామ దేవత శ్రీ మైసమ్మ తల్లి జాతర మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. స్థానిక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు, ఆచార సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు, నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్, గ్రామస్తులు ఉన్నారు.