GDWL: జిల్లాలో అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్, వ్యాలిడేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా ఎన్సీడీ కోఆర్డినేటర్లు హీర్యా నాయక్, శ్యాంసుందర్ ఆరోగ్య సిబ్బందిని సూచించారు. పట్టణంలోని MCH, అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బందితో వారు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బీపీ, షుగర్, క్యాన్సర్ లక్షణాలతో బాధపడుతున్న అనుమానితులను గుర్తించాలన్నారు.