HYD: ఎండల తీవ్రతతో కాచిగూడ రైల్వే స్టేషన్లో నీటి సంక్షోభం పెరుగుతోంది. రోజుకు 26 రైళ్లు, ప్రత్యేక ట్రైన్లకు లక్షల లీటర్ల నీరు అవసరమవుతుండగా భూగర్భ జలాలు తగ్గిపోవడంతో రైల్వేలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రయాణికుల అవసరాలు పెరగడంతో జలమండలి సరఫరాపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.