SRD: కల్హేర్ మండలం మాసంపల్లికి చెందిన బేగరి రమేష్‌ను స్వాన్ ఇండియా జిల్లా కమిటీ నూతన అధ్యక్షుడిగా గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఈ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎం. నర్సింలు, కార్యవర్గ సభ్యులుగా వర్షిత్, శివ, వినయ్, జీవిత, సౌమ్య, జ్యోతి తదితరులు ఎన్నికయ్యారు.