VZM: ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలని APWJF డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయుడు గురువారం పట్డణంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. ఆయనపై అక్రమ కేసులు పెట్టటాన్ని భావ ప్రకటన స్వేచ్చపై దాడిగా అభివర్ణించారు. ప్రజా జీవితంలో ఉన్నవారు అభిప్రాయాలను తెలియజేయాలే తప్పా ఈ విధమైన దాడులకు పాల్పడరాదన్నారు.