ELR: లింగపాలెం మండలం రంగాపురంలో నిర్వహించిన వర్చువల్ మహానాడు 2026 పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని పండుగ వాతావరణాన్ని తలపించేలా సందడి చేశారు.ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొని ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు.