NLG: చండూరు పట్టణంలో గురువారం బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చండూరు ఎస్సై శివ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మత గురువు ముజాహిద్ మాట్లాడుతూ.. విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్ అని, మానవాళికి శాంతి చేకూరాలని ప్రార్థించారు.