MDK: తూప్రాన్ డివిజన్లో 20 రోజుల్లోనే 4.80 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరించినట్టు తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి తెలిపారు. గత ఏడాది డివిజన్ పరిధి ఆరు మండలాలలో 4.77 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. గతంలో కంటే ఈ సారి ఎక్కువ ధాన్యం కొనుగోలు జరిగిందని వివరించారు. ధాన్యం నిలువ చేసేందుకు ఆరు గోదాములను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.