NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఘాట్ రోడ్డులో మే 29 నుంచి వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. తీవ్ర ఎండలు కారణంగా రోడ్డు మరమ్మతు పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, వాతావరణం అనుకూలించిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు.