నెల్లూరు సంతపేట ఈద్గా మసీదులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అన్నారు. మైనార్టీల సంక్షేమానికి వైఎస్ జగన్ ప్రాధాన్యం ఇచ్చారని పర్వతరెడ్డి పేర్కొన్నారు.