AKP: చోడవరం మండలం లక్కవరంలో మరిడిమాంబ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. పాత ఆలయాన్ని తొలగించి నూతనంగా నిర్మించిన ఆలయంలో తొలిసారి జాతర జరగడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనార్థం క్యూ కట్టారు. ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో రావడంతో ఆలయం కిటకిటలాడింది.